JGL: పేదరికం నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో మహిళా సంఘ సభ్యులకు కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జగిత్యాల, మెట్పల్లి పట్టణాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన మహిళలకు ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంల కుట్టుపని అప్పగించనున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మహిళలు పాల్గొంటున్నారు.