KNR: నగరంలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం మానేరు డ్యాం సమీపంలోని ఫిల్టర్ బెడ్, ల్యాబ్‌ను తనిఖీ చేసిన ఆయన.. నీటి నాణ్యతను పరిశీలించారు. పైపులైన్ల లీకేజీలను అరికట్టి, లో-ప్రెషర్ సమస్యను పరిష్కరించాలన్నారు. ‘అమృత్’ పనులను వేగవంతం చేయాలని అన్నారు.