KNR: జమ్మికుంట మార్కెట్‌ను డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం మూసివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా ఆ రోజు మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోతాయని, బుధవారం నుంచి యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించి సహకరించాలని కోరారు.