AP: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ విచారణ చేస్తామని CM చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి సిట్ చీఫ్గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సీనియర్ IPS అధికారులు PHD రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరిని సిట్ చీఫ్గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.