WNP: జిల్లాలో రానున్న వారం రోజుల్లో ఎండల తీవ్రత పెరిగి, గరిష్టంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.