TPT: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నూతన ప్రథమ చికిత్స కేంద్రాన్ని గురువారం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ప్రారంభించారు. ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఆలయ సమీపంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.