GDWL: చిన్నతాండ్రపాడులో మృతి చెందిన మెకానిక్ సత్యం, భరత్ కుటుంబాలకు తోటి కార్మికులు రూ.50 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. సత్యం కుటుంబానికి రూ.26 వేలు, భరత్ కుటుంబానికి రూ.24 వేలు గురువారం అందజేశారు. అనాథలైన వారి పిల్లలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సుధాకర్, దేవరాజు, బీచుపల్లి, చాంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.