PDPL: జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణు భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సమాజ హితం కోసం భగీరథుడు అవిశ్రాంతంగా కృషిచేసి, నేటి యుసమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడని పేర్కొన్నారు. మహనీయులను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.