NRML: నిర్మల్ పట్టణంలో నిన్న రాత్రి బస్సు దొంగతనం చేసిన వ్యక్తిని సోమవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారి వివరాల ప్రకారం నిన్న రాత్రి గణేష్ అనే వ్యక్తి బస్ డిపో గోడ దూకి నిర్మల్ డిపోకు చెందిన బస్సును దొంగలించి కడ్తాల్ వైపుకు తీసుకు వెళ్ళగా,స్థానికుల సమాచారం మేరకు ఆ బస్సును వెంబడించి పట్టుకుని అరెస్టు చేశామన్నారు.