KNR: మాదాపూర్ గ్రామంలో వీధి కుక్కల స్వైరవిహారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం బుచ్చిరెడ్డికి చెందిన రూ.60 వేల విలువైన పాడి ఆవుపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. సమీపంలో కోళ్ల వ్యర్థాలు పడేయడం వల్లే కుక్కలు గుంపులుగా చేరుతున్నాయని, పాకల్లోని పశువులపై దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కుక్కల బెడద నుండి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.