అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4,500కు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు విన్నవించారు. ఇవి BSNL, వొడా ఫోన్, జియోనే కాకుండా.. వందల ఎయిర్ టెల్ ఫోన్ల ట్యాపింగ్ డేటాను నిందితులు ధ్వంసం చేశారని తెలిపారు.