రామ జన్మభూమిలోని అయోధ్య రామాలయంలో పూజలు చేసేందుకు ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తిరస్కరించారు. నిర్మాణం పూర్తి కానీ దేవాలయంలో తాను పూజలు చేయనని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా అయోధ్య నుంచి గోధ్వజ స్థాపన భారత్ యాత్రను అవిముక్తేశ్వరానంద ప్రారంభించారు. అనంతరం రామ జన్మభూమిలో ఉన్న సాధు, సంతులతో సమావేశమయ్యారు. గోరక్షణ కోసం చట్టాలను రూపొందించి, ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.