TG: ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియను ఉన్నత విద్యామండలి ప్రారంభించింది. ఈనెల 13న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. మూడు విడతల్లో సీట్ల భర్తీ, 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వారం తర్వాత నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయని పేర్కొన్నారు.