KKD: ఏజెన్సీ ముఖ ద్వారమైన ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆసుపత్రి కో-చైర్మన్లుగా, వాగు రాజేష్, జొన్నడ వీరబాబులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆసుపత్రి అభివృద్ధి కి కృషి చేయాలని సూచించారు.