AP: త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, గ్రామస్థాయి పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమల లడ్డూ కల్తీ దోషులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.