ఇటీవలి కాలంలో హెజ్బొల్లాను ఊహించని విధంగా దెబ్బకొట్టామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ సందేశాన్ని హెజ్బొల్లా ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే.. త్వరలోనే అర్థం చేసుకుంటుందని అన్నారు. రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. కాగా, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్యం ఆదివారం కూడా భీకర దాడులు కొనసాగాయి. మొత్తంగా ఇజ్రాయెల్ దాడుల్లో 39 మంది చనిపోగా.. 3 వేల మంది గాయాలపాలైనట్లు సమాచారం.