పార్టీ మారకపోతే తనను జైలులో చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయంటూ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జనతాకీ అదాలత్ కార్యక్రమంలో సిసోడియా మాట్లాడారు. కోర్టులో కేజ్రీవాల్ పేరు చెబితే తనను కాపాడుతామన్నారని తెలిపారు. బీజేపీలో చేరాలని.. చేరకుంటే చంపేస్తామని బెదిరించారంటూ ఆరోపించారు. జైలులో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టారన్నారు.