KNR: ఈనెల 17న జరగనున్న ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం వైద్యాధికారులు అవగాహన శిబిరం, వైద్య శిక్షణ నిర్వహించారు. రక్తంలో గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల వచ్చే వంశపారంపర్య వ్యాధి హీమోఫిలియా అని వారు తెలిపారు. చిన్న గాయాలకే అధిక రక్తస్రావం జరుగుతుందని హెచ్చరించారు.