GDWL: మానవపాడు మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ ప్రభాకరయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సుదీర్ఘకాలంగా రేషన్ డీలర్‌గా ప్రజలకు సేవలందించిన ఆయన మరణం పట్ల స్థానికులు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.