VKB: వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామంలో నిర్వహించిన ‘భూ భారతి’ అవగాహన సదస్సులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. వివరాలన్నీ సమీకృత పోర్టల్లో నమోదు చేస్తామని, స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మీ భూమి సరిహద్దులను చూసుకోవచ్చని పేర్కొన్నారు.