TG: మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు పంపిణీ చేసిన ఆయన, మహిళా సంఘాలకు ఏడాదికి రూ.23 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ర్యాలీలు పక్కన పెట్టి సేవా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.