PPM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యధావిధిగా PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియవచ్చన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు.