KRNL: కొత్తపల్లి మండలంలో ఉల్లి రైతులు క్వింటాకు రూ.300 ధర పడిపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో వారి ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని, మద్దతు ధరతో ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.