HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం త్వరలో జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి భాగస్వామ్యం పంచుకున్నారు.