CTR: పుంగనూరులో రేపు నిర్వహించే శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. శ్రవణ నక్షత్రం సందర్భంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుందన్నారు. భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొనాలని కోరారు.