AP: సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందుతూనే ఉందని, అమరావతి కూడా ఇదే తరహాలో అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి ఒక్కరోజుతో ఆగదని, నిరంతర ప్రక్రియ అని చెప్పారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానం ఇస్తుందన్నారు. పిచ్చిపట్టినట్లు చేసే మావిగన్ ప్రకటనలకు ప్రజలే సమాధానం చెబుతారన్నారు. అమరావతి స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అన్నారు.