‘జన నాయగన్’ మూవీ లీక్పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. కెరీర్ ఆరంభంలో తాను కూడా ఇలాంటి బాధను అనుభవించానని, ఇతరులకు హాని చేసేందుకు కొందరు ఎంతకైనా దిగజారుతారని విమర్శించాడు. బాధ్యులను గుర్తించకపోతే అది వ్యవస్థాగత వైఫల్యమేనన్న ఆయన, చిత్రబృందానికి తన మద్దతు ప్రకటించాడు. మనుషులు ఇంత కఠినంగా ఎలా ఉంటారో అర్థం కావడం లేదంటూ పోస్ట్ చేశాడు.