AP: జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. ‘మహిళలు అభివృద్ధి చెందకపోతే దేశానికి పురోగతి అసాధ్యమని విశ్వసించిన పూలే.. నాడే మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించారు. సావిత్రిబాయి పూలేను పాఠశాలకు పంపి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించి, వితంతువుల పునర్వివాహానికి మద్దతుగా జ్యోతిరావు పూలే నిలిచారు’ అని కొనియాడారు.