AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. SIPB, CRDA ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది. అలాగే, పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులు, నెల్లూరు జిల్లాలో మహిళల కోసం కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖలో సెమీ కండెక్టర్ పరిశ్రమ ఏర్పాటు, వివిధ సంస్థలకు భూకేటాయింపుల అంశాల పైనా చర్చించి నిర్ణయం తీసుకునన్నట్లు సమాచారం.