ADB: నేడు రెండవ శనివారం అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు లేదని జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 18న సేవాలాల్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ స్థానిక సెలవు ప్రకటిస్తూ ఏప్రిల్ 11న రెండవ శనివారం పని దినంగా ఉంటుందని సర్కులర్ జారీ చేసినందున జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు యథావిధిగా నడపాలన్నారు.