‘రాకాస’ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. హీరో సంగీత్ శోభన్ తనకు ‘షైనింగ్ స్టార్’ అని కొనియాడింది. సినిమాను హీరో, హీరోయిన్ తమ సొంత చిత్రంగా భావించి ప్రమోట్ చేశారని తెలిపింది. సంగీత్ లాంటి హీరో దొరికితే నిర్మాతకు సగం పని తగ్గినట్లేనని ఆమె ప్రశంసించింది.