Mumbai: Building collapsed due to heavy rains.. Two killed
Mumbai: భారీ వర్షాలకు ముంభైలో ఓ పాత భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారుగా 13 మందిని సిబ్బంది రక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ భవనం కూలిపోయింది. గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈరోజ ఉదయం భవనంలోని ఒక భాగం కూలిపోయింది. భవనంలోని ఒక భాగం పూర్తిగా కూలిపోగా, మిగతా భాగం ప్రమాదకరంగా వేలాడుతూ ఉంది. కొందరిని రక్షించగా మరికొందరు భవనంలోని నివాసితులు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వీరిని బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు.