NZB: భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం స్థానిక మండల విద్యాధికారి స్వామి సందర్శించారు. దీనిలో భాగంగా విద్యార్థుల సమ్మేటివ్ రాత పరీక్షలు 2(SA2) నిర్వహణను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని వివిధ తరగతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలా రాణి, కాశీరాం పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.