తన ప్రేమ, పెళ్లిపై వస్తున్న వార్తలకు నటి కృతి శెట్టి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, మరో ఐదారేళ్లు కెరీర్‌కే ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది. అయితే భవిష్యత్తులో తాను ఎవరితోనైనా డేటింగ్ చేస్తే, కచ్చితంగా అతడినే పెళ్లి చేసుకుంటానని, ప్రేమ విషయంలో తనకు స్పష్టమైన అభిప్రాయం ఉందని తేల్చి చెప్పింది.