TG: ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చివేయడం హేయమైన చర్య అని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వినోభానగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..?లేక పోలీస్ రాజ్యమా..? అని ప్రశ్నించారు. వేల మంది పోలీసులను మోహరించి పేదల ఇళ్లను కూల్చారని.. ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని చెప్పి.. ఉన్న ఇళ్లనే కూల్చుతున్నారని మండిపడ్డారు.