AP: కొటియా గ్రామాలపై అసెంబ్లీలో చర్చించారు. ఏపీ-ఒడిశా సరిహద్దులో 10 గ్రామాలపై ఒడిశా పెత్తనం ఉందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సభ దృష్టికి తెచ్చారు. 10 గ్రామాలను ఒడిశా బలవంతంగా స్వాధీనం చేసుకుందని, ఒడిశా పెత్తనంపై దృష్టి సారించాలని కోరారు. సీఎం చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్‌తో చర్చిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.