AP: కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద టీటీడీ ఉచిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ ఛైర్మన్, కలెక్టర్, ఎస్పీలు భక్తులకు భోజనం వడ్డించారు. గతేడాది రాములవారి కళ్యాణానికి సీఎం చంద్రబాబు వచ్చిన సందర్భంగా.. టీటీడీ తరహాలో ఇక్కడ నిత్యాన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.