TPT: బంగారు చైన్ కోసం వృద్ధ మహిళపై దాడి ఘటన చోటుచేసుకుంది. ఆరింబకం వరలక్ష్మి (68) ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమె బావ కుమార్తె జయరాం వాణి గొంతు పట్టుకుని చైన్ లాక్కొనే ప్రయత్నం చేసి, కర్రతో తలపై కొట్టింది. బాధితురాలి అరుపులు విని వచ్చిన స్థానికులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.