BDK: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చండ్రుగొండ మండల బీజేపీ అధ్యక్షులు రఘుపతి రావు ఆరోపించారు. ఇవాళ BJP పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.