»Is This The Reason For Divorce With Naga Chaitanya Samantha Said The Real Thing
Samantha: నాగచైతన్యతో విడాకులకు కారణం ఈమెనా..? అసలు విషయం చెప్పిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన వైవాహిక జీవితంలో జరిగిన ట్రాజిడీ గురించి అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పంచుకుంది. దాంతో సమంత ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఈమే ఉందా అంటూ నెటిజనులు తెగ వెతికెస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
Is this the reason for divorce with Naga Chaitanya..? Samantha said the real thing
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి అందిరికీ తెలిసిందే. తన మొదటి సినిమా నుంచి ప్రేమ, పెళ్లీ, విడాకులు, ఆనారోగ్యం ఇప్పుడు మళ్లీ సినిమాలు ఇలా ప్రతీ విషయం తెరిచిన పుస్తకం ఆమె జీవితం. అయితే తాజాగా తను పెట్టిన ఓ పోస్ట్ చూస్తే అందరికి ఓ అనుమానం మొదలైంది. ఎంతో చక్కగా కలిసున్న ఈ జంట ఎందుకు విడిపోయిందో ఎవరికి సరైన కారణం తెలియదు. కొందరు పెళ్లైనా సినిమాలు, బోల్డ్ సీన్లు చేస్తుందని, ఇంకొందరు తనకు పిల్లలు కనడం ఇష్టం లేదని ఇలా ఎవరికి తోసినట్లు వారు చెప్పారు. తాజాగా క్లోజ్ ఫ్రెండ్ మేఘనావినోద్తో దిగిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను తీసుకునే అన్ని పనుల్లో మేఘనా సాహకారం ఉంటుంది అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు.
దీంతో సమంత విడాకులు గురించి మేఘనాకు తెలిసే ఉంటుంది. అసలు వీరు విడిపోవడానికి ముందు ఈ విషయం మేఘనతో చర్చించి ఉంటుంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫ్రెండ్‌గా విడాకులు వద్దని చెప్పి ఉంటే బాగుండు అంటున్నారు. అయితే స్నేహితులు ఎప్పుడు హితం కోరుతారు కాబట్టి అలాంటి గట్టు సమయంలో సామ్‌కి మేఘనా సపోర్ట్‌గా నిలిచుంటారు. విడాకుల తరువాత ఒక్క సారిగా ఆనారోగ్యం వెంటాడడం, దాంతో సినిమాలకు దూరం కావడం వీటిన్నింటి నుంచి తట్టుకొని.. ఇప్పుడు మళ్లీ పూర్వ వైభంతో సమంత కనిపిస్తుంది అంటే దానికి కారణం కూడా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీనే కదా అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సమంత సిటాడెల్ సిరీస్ విడుదలకు సిద్దంగా ఉంది.