NLG: చిట్యాల మున్సిపాలిటీలో ఎండల తీవ్రత దృష్ట్యా వీధి వ్యాపారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జి. వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత, వైస్ ఛైర్ పర్సన్ శ్రీలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని వీటిని అందజేశారు. కూరగాయల వ్యాపారులకు ఎండ నుండి ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు.