GDWL: ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామ శివారులో శనివారం బొమ్మ-బొరుసు ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో ఇటిక్యాల ఎస్సై రవి, కోదండపురం ఎస్సై తరుణ్ కుమార్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ దాడుల్లో జూదరుల నుండి రూ.93,200 నగదుతో పాటు 8 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.