TG: హైదరాబాద్లోని KBR పార్కు చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన H-CITI ప్రాజెక్టులోని స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనుల నిమిత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉ.11 నుంచి మ.1 గంట వరకు పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో వన్-వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆ మార్గాల్లో వెళ్లేవారు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.