NZB: కమర్ పల్లి మండలంలోని కోనాపూర్‌లో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూషణరావుపేట తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మక్సూద్ అలీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ లిటరసీ అధికారులు విజయ్ కుమార్, కృష్ణవేణి అన్నారు.