KMM: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు స్పందించి పరిష్కరించాలని మధిర మున్సిపల్ ఛైర్ పర్సన్ సామినేని సుజాత అన్నారు. శనివారం మధిర మున్సిపాలిటీ 4 వ వార్డు ఇల్లందులపాడు, చెరుకు మల్లి వారి వీధి స్థానిక నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించి ఆ ప్రాంత ప్రజలతో ఛైర్మన్ సుజాత ముఖాముఖి నిర్వహించారు. ఇల్లందులపాడులో కొన్నిచోట్ల డ్రైనేజీ సమస్య ఉందన్నారు.