BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుంచే ముస్లిం సోదరులు పట్టణంలోని ఈద్గా వద్దకు భారీగా చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నలు, పెద్దలు ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు.