SDPT: మంచు కొండల్లో కేదార్నాథ్ యాత్రికులకు అందించే సేవలు అమోఘమని ఎమ్మెల్యే హరీశ్ రావు కొనియాడారు. ‘కాం కేదార్నాథ్’ యాత్ర కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 22న యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, వరుసగా ఆరో ఏడాది కూడా భక్తులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్నప్రసాదం తరలించే ఆహార పదార్థాల వాహనాలను ఆయన ప్రారంభించారు.