KMM: నిరుపేదల ఆర్థిక భరోసా కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో 56 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ. 56.06 లక్షలు, 65 మందికి CMRF ద్వారా రూ. 20.44 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ. 76.50 లక్షల సాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు.