VKB: మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలో భవానీ మాత ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళలు నిష్ఠతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న ఈ వేడుకల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.