NLG: తొలి బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల కోసం మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాడని బీసీ జేఏసీ తెలిపింది. సర్దార్ 316వ వర్ధంతి సందర్బంగా స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో గురువారం రోజున పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.